ధనుష్ మొదటి ప్రీ రిలీజ్ రెడీ..ఈ మెగా హీరో కన్ఫర్మ్ అట.!

ప్రస్తుతం భాషా బేధం లేకుండా ఇండియన్ సినిమా దగ్గర సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు హీరోలు తమిళ్ దర్శకులు హిందీ దర్శకులతో హిందీ దర్శకులు తెలుగు హీరోలతో అలాగే తెలుగు దర్శకులు తమిళ్ హీరోస్ తో పలు సినిమాలు చేస్తున్నారు. మరి అలా చేసిన లేటెస్ట్ సినిమాల్లో ఒకటే గ్లోబల్ స్టార్ ధనుష్ నటించిన సినిమా “వాతి”.

తెలుగు యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో “సార్” పేరిట రిలీజ్ కి సిద్ధం కాబోతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఆల్రెడీ హిందీలో ఆడియో ఫంక్షన్ ని జరుపుకోగా ఇక తెలుగులో ధనుష్ మొట్ట మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సిద్ధం అవుతుంది.

మరి ఈ మాసివ్ ఈవెంట్ ని మేకర్స్ ఈ ఫిబ్రవరి 15న ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా నెక్లెస్ రాడ్ పీపుల్ ప్లాజా లో గ్రాండ్ గా చేయనున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. సినిమాపై మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి బజ్ ఉంది. కాగా ఈ ఈవెంట్ కి ఓ మెగా హీరో వస్తాడని రూమర్స్ ఉన్నాయి.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదా మెగాస్టార్ చిరంజీవి ఎవరొకరు కనబడొచ్చని తెలిసింది. కాగా ఇప్పుడు అయితే ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అయితే ధనుష్ మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో తో జరగబోతుంది అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు అలాగే ఈ ఫిబ్రవరి 17న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.