దీపావళి అంటే అదేనట.. ధన్‌రాజ్‌పై హిందూ సంఘాలు ఫైర్

Dhanraj Sensational Comments On Diwali Festival

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, అదిరింది వంటి షోలకు వివాదాలు కొత్తేమీ కాదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, కించపరిచే, తప్పుదోవ పట్టించే స్కిట్స్, సెటైర్స్‌తో రెచ్చిపోతుంటారు. నిత్యం పక్కింటి అమ్మాయి, పక్కింటి సంసారం, అక్రమ సంబంధాలు అంటూ ఇలా పిచ్చిచ్చి కాన్సెప్ట్‌లపై స్కిట్స్ చేస్తుంటారు. ఇక కొందరు కులాలు, మతాలు వంటి సున్నితమైన అంశాలపై పంచ్‌లు వేస్తుంటారు. ఈ క్రమంలో అవి సోషల్ మీడియాలో కొందరి ఆగ్రహానికి గురవుతాయి.

Dhanraj
Dhanraj

ఆ మధ్య వేణుపై దాడి, కెవ్వు కార్తీక్ స్కిట్స్‌పై వ్యతిరేకత ఇలా ఎన్నెన్నో జరిగాయి. ఆ ప్రోగ్రామ్స్‌లో వీరు వేసే స్కిట్స్ అప్పుడప్పుడు సమాజంలో తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తాయి. ఇక ధన్ రాజ్ లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కింగ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. దన్ రాజ్ స్కిట్‌లో ఉండేది దాదాపు డబుల్ మీనింగ్ డైలాగ్సే. తాజాగా ఆయన వేసిన ఓ స్కిట్‌పై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

దీప అనే అమ్మాయి, అలీ అనే అబ్బాయి పెళ్లి చేసుకోవడం వల్లే దీపావళి అనే పండుగ వచ్చిందని ధన్ రాజ్ కామెంట్ చేశాడు. ఇక దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ధన్ రాజ్ దిగి వచ్చి క్షమాపణలు చెప్పాడు. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని మాటిచ్చాడు. మరి ధన్ రాజ్ ఇచ్చిన మాటను, చెప్పిన క్షమాపణలను అవతలి వారు విని శాంతిస్తారో లేదో చూడాలి.