పుష్ప 2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దేవిశ్రీ.. అభిమానులకు పూనకాలే?

పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కి రోజురోజుకు అభిమానులు కూడా పెరిగిపోతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎంతగానో అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి హిట్ కొట్టి అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైనప్పటికీఇంకా పుష్ప సినిమాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి ఎక్కడో ఒకచోట ఈ సినిమాలో పాటలకు రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అభిమానులు సైతం ఈ సినిమా సీక్రెట్ చిత్రం కోసం వేయికళ్లతో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు
ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ పనులు జరుపుకుంటుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు వరుసగా సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోని గత రెండు రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎంతో ఘనంగా పుష్ప2 సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంబంధించి భారీ అప్డేట్ ఇచ్చారు. దేవిశ్రీ సంగీతంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సూపర్ హిట్ పాటలను అందించారో మనకు తెలిసిందే.ఈ క్రమంలోని పుష్ప 2 సినిమాకి అంతకుమించి ఉండేలా మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో దేవిశ్రీ మాట్లాడుతూ ఇప్పటికే పుష్ప 2 సినిమా కోసం మూడు పాటలు పూర్తి అయ్యాయని, ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వెల్లడించారు.