వైరల్ : అనసూయకి గట్టి కౌంటరేసిన దేవరకొండ టీం.!

రీసెంట్ గా కొన్ని రోజులు కితం తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలోకి వచ్చి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సీ సృష్టించే తాను ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేయడం వైరల్ గా మారింది.

పైగా ఇదే ఇష్యూ లోకి ఇతర స్టార్స్ ని కూడా లాగే ప్రయత్నం చేయడం పలు సినీ ట్రాకర్స్ కి కూడా విసుగు తెప్పించింది. అయితే విజయ్ దేవరకొండ తన పేరుకి ముందు “ది” పెట్టుకున్నాడని పైత్యం అని చెప్పి తన పైత్యాన్ని బయట పెట్టిన అనసూయ కి విజయ ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయి.

నిజానికి అది అసలు ఇష్యూ కూడా కాదు కానీ తన అటెన్షన్ కోసం అనసూయ టార్గెట్ చేయడం క్రేజీ థింగ్స్ కి దారి తీసింది. కాగా ఇదిలా ఉండగా అనసూయ అయితే యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేస్తున్న సినిమా టీం అలాగే విజయ్ కు కూడా బాగా దగ్గరైనటువంటి టీం అంతా కూడా అనసూయ ని టార్గెట్ చేస్తూ కావాలనే ఓ పోస్టర్ రిలీజ్ చేయడం క్రేజీ గా మారింది.

బేబీ సినిమా నుంచి ప్రతి ఒక్కరి పేరుకి ముందు కూడా యాడ్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక అనసూయ కి ట్యాగ్ చేసి ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే అనసూయ చేసిన పనికి మాత్రం మేకర్స్ ఈ రకంగా రివెంజ్ తీర్చుకున్నారని చెప్పాలి.