‘దేవర’లో జాన్వీ కపూర్ రోల్ అంత తక్కువా.?

‘దేవర’ సినిమాతో అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో జాన్వీ కపూర్ రోల్‌పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర నిడివి చాలా తక్కువగా వుండబోతోందనీ అంటున్నారు. పాటల విషయంలోనూ కొన్ని అనుమానాలున్నాయ్.

రెగ్యులర్ కమర్షియల్ మూవీకి భిన్నంగా ‘దేవర’ వుండబోతోందనీ అంటున్నారు. సో, ఆ లెక్కల్లో చూసుకుంటే, ఈ సినిమాలో పాటలు చాలా తక్కువగా వుండబోతున్నాయట. సిట్యువేషనల్‌గా సాగే పాటలు తప్ప హీరోయిన్‌తో డ్యూయెట్లూ గట్రా వుండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. సో, జాన్వీ కపూర్ రోల్‌కి పెద్దగా స్కోప్ వుండదని తెలుస్తోంది.

అయితే, స్క్రీన్‌పై జాన్వీ కపూర్ పర్‌ఫామెన్స్ ఎలా వుంటుందో అందరికీ తెలిసిందే. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రాల లిస్టు తీస్తే అది అర్ధమైపోతుంది. పర్‌ఫామెన్సే కాదు, ఆమె ఎంచుకునే సబ్జెక్టులు కూడా చాలా ప్రత్యేకంగా వుంటాయ్. కథతో ఆమె, ఆమెతో కథ పోటీ పడేలా జాన్వీ కపూర్ ఎంచుకునే కాన్సెప్టులుంటాయ్.

అలాంటిది, తెలుగులో తొలి సినిమాకి జాన్వీ ఇలాంటి లెక్కలు వేసుకోకుండానే ఒప్పుకుని వుంటుందా.? ఏమో చూడాలి మరి.