ఇలా కూడా వాడేస్తున్నారా?.. దీప్తి సునయన వీడియో వైరల్

Deepthi Sunaina Ad For sanitizers

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందు దీప్తి సునయన డబ్ స్మాష్‌లతో బాగా ఫేమస్. సమంత డైలాగ్‌లను చెబుతూ.. ఆమెలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంతో దీప్తి సునయకు బాగానే క్రేజ్ వచ్చింది. ఆ క్రేజే బిగ్ బాస్ వరకు తీసుకొచ్చింది. ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చాక దీప్తి సునయన అందరికీ తెలిసిందే. అయితే షోలో ఏదో గొప్పగా ఆడిందని క్రేజ్ మాత్రం రాలేదు.

Deepthi Sunaina Ad For sanitizers
Deepthi Sunaina Ad For sanitizers

తనీష్, సామ్రాట్, తేజస్వీ గ్యాంగ్‌లతో ఏదో కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ముఖ్యంగా తనీష్ నడిపిన ట్రాక్‌తోనే సేవ్ అవుతూ వచ్చింది. కౌశల్‌తో అమార్యదగా మాట్లాడటం, మాటలు జారడంతో ఎలిమినేషన్ వేటు తప్పలేదు. అలా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చే సమయానికి దీప్తి సునయన బ్యాడ్ ఇమేజ్‌తోనే ఉంది. ఆమె ప్రేమ వ్యవహారం కూడా బాగానే వైరల్ అయింది. షణ్ముఖ్ అంటూ పదే పదే అతని టాపిక్ వచ్చేది.

బయటకు వచ్చాక దీప్తి సునయనకు ఏమంతా గొప్పగా అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్ చేసుకుంటూ బిజీగా ఉంటోంది. తాజాగా దీప్తి సునయన ఓ ప్రకటనలో నటించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న కారణంగా అందరూ శానిటైజర్లు కచ్చితంగా వాడుతున్నారు. ప్రకృతి సహజ సిద్దమైన శానిటైజర్ వాడుతున్నాను.. మీరు కూడా వాడండి అంటూ దీప్తి సునయన యాడ్‌లో నటించింది. ఈ వీడియోలో దీప్తి సునయన చాలా కష్టపడి యోగాసానాలు వేసినట్టు కనిపిస్తోంది.