నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. జారా పటేల్ అనే ఓ సోషల్ విూడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ విూడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు స్టార్స్ ఇప్పటికే మండిపడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య సహా పలువురు ఇప్పటికే రష్మికకు మద్దతుగా నిలిచారు.
ఈ నేపథ్యంలో జారా పటేల్ కూడా మార్ఫింగ్ వీడియోపై స్పందించింది. ఈ వీడియో మార్ఫింగ్‌లో తన ప్రమేయం ఏవిూ లేదని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిరచింది. వీడియో చూసి తీవ్రంగా కలత చెందినట్లు చెప్పింది. ‘అందరికీ హాయ్, నా శరీరాన్ని, ప్రముఖ బాలీవుడ్ నటి (రష్మికను ఉద్దేశిస్తూ) ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ఫేక్ వీడియోను రూపొందించినట్లు నా దృష్టికి వచ్చింది. డీప్‌ఫేక్ వీడియోతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు.
ఈ ఘటనతో నేను తీవ్రంగా కలత చెందాను. ఆందోళనకు గురయ్యా. భవిష్యత్తులో మహిళలు, ఆడపిల్లల భద్రత గురించి తలుచుకుంటే భయమేస్తోంది. సోషల్ విూడియాలో తమ ఫొటోలను పోస్ట్ చేసే విషయంలో మహిళలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇంటర్నెట్‌లో కనిపించేది అంతా నిజం కాదు. నిజానిజాలేమిటో తెలుసుకొన్న తర్వాత నిర్ధారణకు వస్తే మంచిది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
జారా పటేల్ ఓ బ్రిటిష్`ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సోషల్ విూడియాలో జారా ఎక్కువగా బోల్డ్ కంటెంట్‌ను షేర్ చేయడంలో గుర్తింపు పొందింది. ఆమె ఇన్‌స్టా బయో ప్రకారం.. జారా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదేవిధంగా తానో మానసిక ఆరోగ్య న్యాయవాది అని బయోలో పేర్కొంది. ఎక్కువగా తన ఫాలోవర్స్ కోసం అడల్ట్ కంటెంట్‌ను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటుంది. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీన ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోనే కొందరు రష్మిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసి సోషల్ విూడియాలో వైరల్ చేస్తున్నారు.
కొందరు ఆకతాయిలు ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ మాట్లాడుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు.
ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ విూడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కూడా స్పందించారు. వీడియోపై సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.