Dasvi : అందరూ దీపికా పడుకొనే ను లవ్ చేస్తారు అంటున్న అభిషేక్ బచ్చన్… దీపిక ఎలా స్పందించిందో తెలుసా…!

Dasvi : అభిషేక్ బచ్చన్ నటిస్తున్న కొత్త చిత్రం దాస్వి. ఇందులో యామి గౌతమ్, నిమ్రాత్ కౌర్ నటిస్తున్నారు. దాస్వి సినిమా ఒక సోషల్ కామెడీ డ్రామా గా తెరకెక్కించారు దర్శకులు తుషార్ జాలోటా.ఇక ఈ చిత్రాన్ని దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో నటిస్తున్న అభిషేక్, యామి, నిమ్రాత్ లా నటన ప్రేక్షకులను అకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక సినిమాలో అభిషేక్ ఒక 10వ తరగతి డ్రాప్ అవుట్ గా ఉంది రాజకీయనాయకుడు అవ్వాలని అనుకుంటాడు. అయితే జైలు లో జరిగే సంఘటనలతో చదువుకుని 10వ తరగతి పాస్ అవ్వాలనుకుంటాడు. ఈ క్రమంలో జరిగే కథ హాస్యాస్పదంగా ఉండబోతోంది. ఎక్కడ యామి గౌతమ్ ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను, నిమ్రాత్ భార్యగాను నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో అభిషేక్ చెప్పే ఒక డైలాగ్ వైరల్ అవుతోంది. ఇంగ్లీష్ నేర్చుకుంటున్న అభిషేక్ రన్వీర్ లవ్స్ దీపికా ను పాసివ్ వాయిస్ లో చెప్పమనగా ఆల్ అర్ లవ్స్ దీపికా అంటూ సాగే డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ ట్రైలర్ పై దీపికా స్పందిస్తూ మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది.