వరుసగా ఒక్కో సినిమా డిజిటల్ రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయి. ఇటీవల ఓటీటీల్లో భారీ చెల్లింపులు జరుగుతుండడంతో నిర్మాతలు బెట్టు వీడి తమ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తొలిగా నాని- సుధీర్ బాబుల మల్టీస్టారర్ `వీ` రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఆ తర్వాత మరో అరడజను సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఇటీవల రిలీజ్ కి రెడీ అయిన వాటిలో ఉప్పెనకు చక్కని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా పాటలు ఆకట్టుకున్నాయి. దేవీశ్రీ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి జంట మ్యాజిక్ పెద్ద తెరపై వర్కవుటవుతుందన్న చర్చా సాగింది. కానీ అనూహ్యంగా కోవిడ్ మహమ్మారీ థియేట్రికల్ రిలీజ్ లేకుండా చెక్ పెట్టేసింది.
ఆ క్రమంలోనే పలు ఓటీటీ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ ని సంప్రదించి భారీ మొత్తాల్ని ఆఫర్ చేశాయట. కానీ ఓటీటీ రిలీజ్ కి మైత్రి వాళ్లు అనాసక్తిగా ఉన్నారని తెలిసింది. వీలు కుదరితే సంక్రాంతి వరకూ వేచి చూడాలని భావిస్తున్నారట. అయినా ఓటీటీలో 13 కోట్ల మేర ఆఫర్ వచ్చిందని .. కానీ కాదనుకున్నారని తాజాగా ఫిలింసర్కిల్స్ లో ముచ్చటించుకుంటున్నారు. అయితే కోవిడ్ శాంతిస్తుందా? వ్యాక్సిన్ వస్తుందా? అన్నది ఏ సినిమా ఫేట్ ని అయినా డిసైడ్ చేస్తుంది. పైగా దాదాపు 23 కోట్ల మేర బడ్జెట్ ని వెచ్చించిన ఇలాంటి సినిమాకి ఓటీటీ వర్కవుట్ కాదన్న అభిప్రాయం ఉంది. అందుకే నిర్మాతలు ఇంకా పెద్ద మొత్తం ఆశించి ఓకే చెప్పలేదా? అన్నది చూడాలి.