మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఖుషీ చేసిన డేవిడ్ వార్నర్ ..!

మహేష్ బాబు కి ఇండస్ట్రీలోనే అభిమానులున్నారు. మహేష్ బాబు ని చూసి ఇన్‌స్పైర్ అయ్యే యంగ్ హీరోలు.. హీరోయిన్స్ ఆయన సినిమాలకి సినిమాలలోని డైలాగ్స్ కి ఫ్యాన్స్ గా మారారు. ఇక బయట మహేష్ బాబు కి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ఎన్ని అభిమాన సంఘాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత మూడు నాలుగేళ్ళుగా వరస సక్సస్ లతో ఉన్న మహేష్ బాబు గత ఏడాది కూడా సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్ళని రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా బాప్ అనిపించుకున్నాడు.

అయితే ఇప్పుడు మహేష్ బాబు కి ఒక పాపులర్ క్రికెటర్ అభిమానిగా మారాడు. అంతేకాదు మహేష్ బాబు ని అనుకరిస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ చేశాడు. ఈ మధ్య ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సౌత్ హీరోల డ్యాన్సులను ఇమిటేట్ చేస్తూ బాగా క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇందుకు ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మన టాలీవుడ్ హీరోలకి .. వాళ్ళ సినిమాలకి తెగ ఫ్యాన్ అయిపోయాడు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా మన తెలుగు హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలోని సాంగ్స్ కి పేరడి చేసి సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాడు.

బాహుబలి సినిమాలోని ప్రభాస్ డైలాగ్ లతో వీడియోని రిలీజ్ చేయగా వైరల్ అయ్యింది. వీటికోసం సాంకేతికతను ఉపయోగించడం ఆసక్తికరం. ఆ వీడియోల కోసం ఫేస్ ఆఫ్ యాప్ ని ఉపయోగించాడు డేవిడ్ వార్నర్. అలాగే బుట్టబొమ్మ సాంగ్ కి స్టెప్పులేసి ట్రెండింగ్ లో నిలిచాడు. మహేశ్ నటించిన మహర్షి సినిమాలో సీన్స్ అలాగే రజినీకాంత్ నటించిన దర్బార్ సీన్స్ ని వార్నర్ ఇమిటేట్ చేశాడు. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య టీజర్ ను రీఫేస్ యాప్ లో తన ఫేస్ ని యాడ్ చేసి సందడి చేశాడు. ఇక తాజాగా మహేష్ నటించిన మహర్షి లోని పాలపిట్ట పాటకు స్టెప్పులేశాడు. రీఫేస్ వీడియో షేర్ చేసి ‘టైమ్ ఆఫ్ ది డే.. హీరో సినిమాను మీరు గుర్తిస్తారని అనుకుంటున్నాను’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇది చూసిన మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఆ మధ్య పూరి జగన్నాధ్ డేవిడ్ వార్నర్ తో సినిమా చేయనున్నాడన్న ఫన్నీ న్యూస్ వచ్చి కూడా వైరల్ అయింది.