అయ్యా ఏజెంట్.. ఈ టైమ్ చాలా కీలకం

అఖిల్ నుంచి రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్ పై మొదట్లో అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అంతగా బజ్ ఏర్పడడం లేదు. షూటింగ్ అలాగే విడుదల తేదీలలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఏది ఏమైనప్పటికీ సినిమా ఆలస్యం ఒక విధంగా ప్రేక్షకులలో ఆసక్తిని తగ్గిస్తుంది. దీని వలన సాలిడ్ బజ్‌ని సృష్టించడం సవాలుగా మారింది.

టీజర్లు పాటలు విడుదల చేసినప్పటికీ, ప్రచార కంటెంట్ ప్రేక్షకుల నుండి తగినంత రెస్పాన్స్ అందుకోలేదు. సినిమాలో థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సురేందర్ రెడ్డి స్టైలిష్ కథనం ఉంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే విడుదలకు కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నందున, ఏజెంట్ బృందం తమ ప్రచార కంటెంట్ గేమ్‌ను మరింత వేగవంతం చేయాలి.

ఇదే చాలా కీలకమైన సమయం. పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా అప్డేట్స్ రిలీజ్ చేయాలి. సినిమాని బ్లాక్‌బస్టర్ హిట్‌గా మార్చే బజ్‌ని సృష్టించడం మేకర్స్‌కి ఇప్పుడు చాలా అవసరం. ఇక ఎకె ఎంటర్‌టైన్‌మెంట్ సురేందర్ 2 ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించాయి. ఏప్రిల్ 2021లో ప్రారంభమైన ఈ చిత్రం దాదాపు రెండేళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇంకా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిత్రంలో మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో నటించగా హీరోయిన్ నటి సాక్షి వైద్యకు ఇదే తొలి సినిమా. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.