ప్రభాస్ క్రేజ్ ఉన్నా.. ‘రానా’కు క్రెడిట్ ఇవ్వాల్సిందే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రాజెక్ట్ కె అని వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమితాబచ్చన్ పరశురాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇండియన్ మైథాలజీలోని శ్రీ మహావిష్ణువు చివరి అవతారం అయిన కల్కి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని యూఎస్ లోని కామిక్ కాన్ ఈవెంట్ లో గ్రాండ్ గా ఆవిష్కరించారు. ఇక ఈ ఈవెంట్ దగ్గుబాటి రానా లీడ్ చేశాడు. ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. నిజానికి ఈ చిత్రంలో రానా నటించడం లేదు. అయితే ప్రభాస్ తో ఉన్న అనుబంధం కొద్ది ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ని హోస్ట్ చేసే బాద్యత తీసుకున్నాడు.

ఇంటర్నేషనల్ మీడియా ముందు కల్కి 2898 ఏడీ సినిమా టీమ్ మొత్తాన్ని పరిచయం చేయడంతో పాటు ఈ సినిమా నేపథ్యం గురించి కూడా పరిచయం చేశారు. అలాగే భారతీయ ఇతిహాసాలని ప్రపంచానికి పరిచయం చేశారు. రానాకి హోస్ట్ గా మంచి అనుభవం ఉంది. టాక్ షోని లీడ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అలాగే సినిమా ఫంక్షన్స్ ని కూడా హోస్ట్ చేశారు.

ఇప్పుడు మొదటి సారి ఇలా ఇంటర్నేషనల్ లెవల్ లో కల్కి 2898 ఏడీ గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ ని లాంచ్ చేసే కార్యక్రమానికి హోస్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని గొప్పగా పరిచయం చేశారు. ఇప్పటికే రాజమౌళి బాహుబలి సిరీస్ తో ప్రభాస్ వరల్డ్ యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో అంతర్జాతీయ యాక్టర్ గా మారిపోయాడని చెప్పాలి.

ఇక ఎలాంటి బేషాజాలకి పోకుండా ఈ ఈవెంట్ ని హోస్ట్ చేసిన విధానం ఆకట్టుకుందని చెప్పాలి. రానా హోస్ట్ గా తన కెపాసిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు అని ఈ ఈవెంట్ తో కన్ఫర్మ్ అయ్యింది.