ఏంటి “సలార్ 2” అప్పుడేనా.. 

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం “సలార్” తో తన కెరీర్ లో మాసివ్ హిట్ ని తాను అందుకోగా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇదే ఏడాదిలో రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ కి తీసుకురాబోతున్నాడు. కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా దీనిని “సలార్ శౌర్యంగ పర్వం” గా అనౌన్స్ చేయగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ పార్ట్ 2 కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని మేకర్స్ కాస్త ఆలస్యంగానే స్టార్ట్ చేస్తారని స్వయంగా ప్రభాస్ తెలిపాడు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కథనాలు మాత్రం గట్టిగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సలార్ పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేస్తారని ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేసే సినిమా కంటే ముందే సలార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం ఉందని కొత్త రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ పార్ట్ 2 షూటింగ్ కూడా కొంతమేర ప్రశాంత్ నీల్ ఎప్పుడో చేసేసాడు.

ఇప్పుడు సినిమా సక్సెస్ వేడుకలు బాగానే చేసుకుంటున్నారు. దీనితో సలార్ షూటింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేస్తారని పలు రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇప్పుడు ఆగి చూడాల్సిందే. ఆల్రెడీ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి మే లో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా మరో చిత్రం రాజా సాబ్ ఫైనల్ స్టేజి కి వెళ్తుంది.