కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ పై క్రేజీ అప్‌డేట్ .. రిలీజ్ ఎప్పుడంటే ?

యశ్…కేజీఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. కేజీఎప్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కేజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమా కన్నడలో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు హిందీలో దాదాపు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే రూ. 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది.

Yash Prashanth Neel Sanjay dutt  KGF 2 Chapter 2 Movie Release date Announced today, KGF 2 - Yash: యశ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీ పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్.. ,KGF 2,KGF Chapter 2 Release date,Yash,KGF Star Yash,Yash Remunaration,,Yash Remunaration KGF Movie,,Yash Remunaration For KGF Chapter 2,kgf chapter 2 teaser,kgf chapter 2 teaser records,kgf chapter 2 teaser views,kgf chapter 2 teaser reaction,kgf chapter 2 trailer,kgf 2 teaser,kgf chapter 2 teaser 100 million views,kgf chapter 2 teaser review,kgf chapter 2 official teaser,kgf chapter 2 teaser views count,kgf chapter 2 teaser views counting,yash kgf chapter 2,kgf chapter 2 updates,కెజియఫ్ 2,కెజియఫ్ ఛాప్టర్ 2 టీజర్ రికార్డులు,కెజియఫ్ 2 టీజర్ 100 మిలియన్ వ్యూస్,యశ్ రెమ్యునరేషన్,కేజీఎప్ 2 కోసం యశ్ భారీ పారితోషకం,కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేది,కేజీఎఫ్ 2 మూవీ విడుదల తేది

ప్రభాస్ తర్వాత యాష్ ప్యాన్ ఇండియా స్టార్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు.అధీరా పాత్రలో సంజయ్ దత్‌ నటిస్తున్నాడు. ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

గత రెండు మూడు రోజులు అందరు హీరోలు తమ సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 యూనిట్ ఈ సినిమా విడుదల తేదిని ఈ రోజు సాయంత్రం 6.32 నిమిషాలకు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కేజీఎఫ్ 2 మూవీనే.