ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్న పలు భారీ చిత్రాలు అండ్ సెన్సేషనల్ కాంబినేషన్స్ లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ సినిమాగా తెరకెక్కనుంది.
కాగా ఈ చిత్రం ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసుకోనుండగా ఈ గ్యాప్ లో అయితే ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో “దేవర” అనే భారీ సినిమా చేస్తుండగా ఈ చిత్రం తర్వాత నీల్ చిత్రంలోకి తారక్ వచ్చే ఏడాది జాయిన్ కానున్నాడు. మరి రీసెంట్ గానే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలుపగా అది వైరల్ గా మారింది.
ఇక ఈ చిత్రం పై ఇప్పుడు నేరుగా నిర్మాణ సంస్థ అయితే మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా అందించారు. కాగా దీనితో అయితే తమ మోస్ట్ అవైటెడ్ పవర్ ఫుల్ కాంబో ఏప్రిల్ 2024 నుంచి షూట్ స్టార్ట్ చేసుకోబోతుంది అని తెలిపారు. అంతే కాకుండా ఈ హై ఆక్టన్ చిత్రం అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది అని కూడా సాలిడ్ ఎలివేషన్ ఇస్తున్నారు.
దీనితో ఈ భారీ చిత్రం పై హైప్ మరింత స్థాయిలోకి వెళ్ళింది. ఇక ఈ మాస్ చిత్రంని మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
s://twitter.com/MythriOfficial/status/1709867366694490416