క్రేజీ : పవన్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు సహా రాజకీయాలు చేస్తుండగా ఇక పవన్ ఫ్యాన్స్ కి అయితే భారీ ట్రీట్ అండ్ ది బిగ్ డే అయితే ఇప్పుడు వచ్చింది. కాగా పవన్ పుట్టినరోజు రేపు కాగా ఈ బిగ్ డే కి పవన్ ఫ్యాన్స్ గ్రాండ్ ప్లానింగ్ లు చేస్తుండగా..

రేపు అయితే పవన్ ఫ్యాన్స్ కోసం ఏకంగా మొత్తం ట్రిపుల్ ధమాకా ట్రీట్ గా రావడం అయితే ఇప్పుడు ఖరారు అయ్యింది. కాగా ఇపుడు పవన్ చేతిలో మూడు భారీ చిత్రాలు ఉండగా ఈ చిత్రాల్లో రెండు పాన్ ఇండియా చిత్రాలు ఒక రీజనల్ మూవీ అయితే ఉంది. మరి ఈ మూడు సినిమాలు నుంచి కూడా ఒకో అప్డేట్ ఇప్పుడు ఫిక్స్ అయ్యింది.

మొదటిగా సెన్సేషనల్ ఏక్షన్ డ్రామా “ఓజి” నుంచి ఉదయం క్రేజీ గ్లింప్స్ ని మేకర్స్ సిద్ధం చేయగా ఈ ట్రీట్ కన్నా ముందే అర్ధ రాత్రి 12 గంటల 17 నిమిషాలకి అయితే పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” నుంచి అయితే ఓ బ్రాండ్ న్యూస్ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు.

మరి వీటితో పాటుగా పవన్ నటిస్తున్న రీమేక్ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి కూడా ఓ పోస్టర్ వస్తుంది అని తెలుస్తుంది. దీనితో పవన్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ అయితే ఇప్పుడు సిద్ధం కాబోతుంది అని చెప్పాలి. మరి ఉస్తాద్ ని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా ఓజి చిత్రాన్ని సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.