క్రేజీ టాక్ : “సలార్” కి ఏపీలో రికార్డు బిజినెస్.?

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వైరల్ మరోసారి యంగ్ రెబల్ స్టార్ పేరు అయితే నిలిచింది. మరి నిన్న మొన్నటి వరకు ప్రభాస్ లుక్స్ పై కొన్ని ఫేక్ పోస్ట్ లు వైరల్ గా మారగా ఇప్పుడు అయితే ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా సలార్ బిజినెస్ కి సంబంధించిన టాక్ ఒకటి కేజ్రీగా మారింది.

కాగా ఈ సినిమాని కన్నడ సెన్సేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మరి ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్లాన్ చేస్తున్నారు. దీనితో ఈ సినిమాపై ఫుల్ డిమాండ్ నెలకొనగా ఇక లేటెస్ట్ గా అయితే ఈ సినిమాకి ఏపీలో రికార్డు బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాకి ఒక్క ఏపీ లోనే 100 కోట్ల రికార్డు బిజినెస్ జరుపుతున్నట్టుగా లేటెస్ట్ గా వచ్చిన టాక్. దీనితో అయితే సలార్ పై హైప్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక మరో పక్క నైజాం లో కూడా ఈ సినిమాకి ఈ రేంజ్ లోనే బిజినెస్ ఉంటుంది అని మరో గాసిప్ ఉంది.

దీనితో అయితే సలార్ కి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 200 కోట్లు టార్గెట్ పెట్టుకుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో అయితే పృథ్వీ రాజ్ సుకుమారన్ జగపతి బాబు లు విలన్స్ గా నటిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హోంబలె ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ కూడా కనిపించే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ ఉన్నాయి.