క్రేజీ : “జవాన్” వీకెండ్ కి ఇప్పుడే అంచనా వసూళ్లు.!

ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి దుమ్ము లేపుతున్న స్టార్ హీరో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అని చెప్పాలి. కాగా షారుఖ్ హీరోగా నటించిన గత సినిమా పఠాన్ నే క్రేజీ రికార్డులు సెట్ చేయగా ఈ సినిమా అనంతరం వచ్చిన జవాన్ ఇప్పుడు దాని రికార్డులు తిరగరాసి కొత్తవి సెట్ చేస్తుంది.

కాగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నట్టుగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది. రెండో రోజు కూడా మాసివ్ వసూళ్లు కొట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ తెలిపాయి. దీనితో ఈ చిత్రం ఏకంగా రెండు రోజుల్లో ఒక్క ఇండియా లోనే 120 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా వరల్డ్ వైడ్ అయితే చెప్పక్కర్లేదు.

మరి రెండో రోజు ఇండియా వైడ్ 47 కోట్లకి పైగా గ్రాస్ ని హిందీ నుంచి 7 కోట్ల గ్రాస్ ని సౌత్ నుంచి అందుకుందని చెప్తున్నారు. కాగా జవాన్ విషయంలో ఇప్పుడు ట్రేడ్ పండితులు మరింత ఆసక్తిగా మారుస్తున్నారు. ఇంకా ఈ వీకెండ్ కంప్లీట్ కాకుండానే టోటల్ వీకెండ్ వసూళ్లు ఇంత రావచ్చని ముందే అంచనా వేస్తున్నారు.

కాగా ఈ చిత్రం ఈ వీకెండ్ కి అయితే ఏకంగా 240 నుంచి 250 కోట్ల గ్రాస్ ని ఈజీగా అందుకుంటుంది అని అంటున్నారు. దీనితో ఇదొక సెన్సేషనల్ వీకెండ్ అవుతుంది అని చెప్పాలి. మొత్తానికి అయితే షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో క్రేజీ హిట్ అయితే పడినట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు అలాగే గౌరి ఖాన్ నిర్మాణం వహించారు.