“కేజీఎఫ్” సిరీస్ లో మరో “హీరోలా”?ఊహించని డీటెయిల్స్.!

ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు సినిమాలు సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లు మొదలయ్యాయి కాన్సెప్ట్ లు ఎవనప్పటికీ సీక్వెల్స్ పరంగా అలా ఇప్పుడు సరికొత్త సినిమాలు వచ్చి ఆడియెన్స్ కి అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా మొదటగా తెలుగు చిత్రం బాహుబలి సిరీస్ ప్రపంచ సినిమాకి గేట్లు తీయగా ఈ కోవలో భారీ చిత్రం కేజీఎఫ్ కన్నడ నుంచి అలాగే పొన్నియిన్ సెల్వన్ తమిళ్ నుంచి హిందీ నుంచి కూడా పలు చిత్రాలు వస్తున్నాయి.

అయితే ఇండస్ట్రీ దగ్గర బాహుబలి సిరీస్ ఏ రేంజ్ సెన్సేషన్ ని భాషా బేధం లేకుండా దుమ్ము లేపిందో తర్వాత ఆ రేంజ్ హైప్ కేజీఎఫ్ 2 అందుకుంది. మరి అందులో బాహుబలి అంటే ప్రభాస్ మాత్రమే మరొకరు లేరు అనేది ఎంత సత్యమో కేజీఎఫ్ కి కూడా రాకీ భాయ్ అంటే యష్ మాత్రమే అన్నట్టుగా ముద్ర పడిపోయింది.

అయితే ఈ సెన్సేషనల్ సిరీస్ లో నెక్స్ట్ కేజీఎఫ్ 3 ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సిరీస్ పై చిత్ర యూనిట్ నుంచి ఇప్పుడు ఊహించని డీటెయిల్స్ బయటకి వచ్చాయి. ఇంతకీ వారు ఏం చెపుతున్నారంటే ఈ సినిమాలను హాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ జేమ్స్ బాండ్ లా ప్లాన్ చేస్తున్నారట.

అయితే కొన్ని సీక్వెల్స్ లో ఓ హీరో మళ్ళీ అదే థీమ్ ఉంచి ఇంకో కొత్త హీరోలుతో ఆ చిత్రాలు చేసారు. మరి అలాగే కొన్ని సినిమాల వరకు రాకీ భాయ్ పాత్రలో యష్ ఉండి తర్వాత మళ్ళీ మరో హీరో వస్తాడా? అనేది ప్రశ్నగా మారింది. అయితే ఇలా ఫ్రాంఛైజ్ లలో హీరోలని మార్చడం కొత్తేమి కాదు.

హాలీవుడ్ లో స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలకి కూడా చేశారు. మరి ఇదే ఫార్మాట్ లో మన దగ్గర కేజీఎఫ్ కి కూడా చేస్తారా అనేది ఇప్పుడు ఎగ్జైటింగ్ గా మారింది. ఒకవేళ మారిస్తే ఇండియా ఆడియెన్స్ దాన్ని ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూడాలి.