గాసిప్స్ : “ఆదిపురుష్” భారీ ఈవెంట్ ఖర్చు ఎంతంటే.!

ఇపుడు పాన్ ఇండియా వీక్షకులు సహా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్”. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత మళ్ళీ చేసిన ఓ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది కాగా భారీ అంచనాలు అయితే ఇప్పుడు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ అయితే మరికొన్ని రోజుల్లోనే రాబోతుండగా..

ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి ఇపుడు మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ఈ జూన్ 6న అయితే అత్యంత ఘనంగా ఈ జూన్ 6న తిరుపతిలో చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ మాసివ్ ఈవెంట్ కి నెవర్ బిఫోర్ ప్లానింగ్ లు సరికొత్తగా చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. కాగా ఈ మాసివ్ ఈవెంట్ పై ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది.

ఈ ఈవెంట్ లో భారీ బాణాసంచా ని ప్లాన్ చేస్తున్నారట. కేవలం వీటికే మేకర్స్ సుమారు 50 లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ బాణాసంచాలో కొన్ని ఆశ్చర్యకర అంశాలు థ్రిల్ చేస్తాయట. కాగా వీటితో పాటుగా మొత్తం ఈవెంట్ ని నిర్వహించడానికి ఏకంగా 2 కోట్లు పెట్టినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి రెండు కోట్లతో ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్ ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ చిత్రాన్ని హిందీ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించగా కృతి సనన్ సీతగా సైఫ్ అలీఖాన్ రావణాసుర పాత్రలో అయితే నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం గ్రాండ్ గా జూన్ 16న 2డి, 3డి సహా 4డిఎక్స్ వెర్షన్ లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.