భారతదేశం గర్వించదగ్గ నటులలో ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్. వృత్తి రీత్యా కండెక్టర్ అయిన రజనీకాంత్ సినిమాలలోక వచ్చాక దేశ విదేశాలలో అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం రజనీకాంత్‌ది. సాధారణమైన జీవితం గడుపుతూ వస్తున్న రజనీకాంత్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి రావాలని భావించారు. కాని కరోనా మహమ్మారి ఆయన ఆలోచనలకు గండికొట్టింది.
రజనీకాంత్‌కి గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ పరిస్థితులలో ఆయన పార్టీ పెట్టి రాజకీయాలలోకి రావడం అనేది పెద్ద సాహసం అవుతుంది. డిసెంబర్‌లో ఏదనే విషయం నిర్ణయిస్తామని ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.అయితే రజనీకాంత్ జీవితం తెరచిన పుస్తకం లాంటింది. ఆయన జీవితం గురించి ఎంతో కొంత తెలిసిన తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎంతో కష్టపడితే గాని ఆయన ఈ స్థితికి రాలేదు
ప్రముఖ దర్శకుడు, రజినీకాంత్ అభిమాని అయిన లింగుస్వామి రజనీకాంత్ జీవిత చరిత్ర అందరికి తెలియజెప్పేలా బయోపిక్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో రజినీకాంత్‌గా ఆయన పెద్దల్లుడు ధనుష్ నటించనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని తెలుస్తుంది. రజనీకాంత్ కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగన్‌గల్’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలతో పాటు పలు అమెరికన్ సినిమాల్లోనూ మెరిశారు. ప్రస్తుతం అన్నాత్తె అనే చిత్రంతో రజనీకాంత్ బిజీగా ఉన్నారు.