Big Boss: బుల్లితెరపై ప్రసారమౌతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే అన్ని భాషలలో ఈ కార్యక్రమం సీజన్లను పూర్తిచేసుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికే ఐదు నెలలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరి కొన్ని గంటలలో ఓటీటీలో ప్రసారం కానుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూడగా ఈ కార్యక్రమంపై సీపీఐ నారాయణ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గతంలో కూడా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా ఈ కార్యక్రమం ప్రసారం కానున్న నేపథ్యంలో మరోసారి ఈ కార్యక్రమంపై సీపీఐ నారాయణ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం రెడ్ లైట్ ఏరియా కన్నా చాలా ప్రమాదకరమని ఆయన మాట్లాడారు. బిగ్ బాస్ అనేది సమాజానికి ఒక నేరపూరితమైన సమస్థ ఇది ఒక కల్చరల్ షో, కల్చరల్ ఈవెంట్ కాదని ఈ కార్యక్రమం లైసెన్స్ తీసుకున్న ఒక బ్రోతల్ హౌస్ అంటూ సీపీఐ నారాయణ ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే గత సీజన్లో బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా కొంతమంది తీవ్ర స్థాయిలో రెచ్చిపోయి రొమాన్స్ చేశారు.ఇలా ప్రేక్షకులకు విసుగు పుట్టేలా కంటెస్టెంట్ తో రొమాన్స్ చేయడం వల్ల ఎంతో మంది ఈ కార్యక్రమం పై స్పందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ కార్యక్రమాలను నిలిపివేయాలంటూ పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమం ఈసారి బుల్లితెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం కావడంతో మరోసారి ఈ కార్యక్రమంపై
సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.