కన్ఫర్మ్ – హాలీవుడ్ రొటీన్ కాన్సెప్ట్ తో “ప్రాజెక్ట్ కే” చిత్రం 

ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా కూడా ఎంతో గర్వంగా మాట్లాడుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కే” అనే చెప్పాలి. కాగా ఈ సినిమా ఇపుడు హాలీవుడ్ లో జరుగుతున్న బిగ్గెస్ట్ మూవీ ఫెస్టివల్ కామిక్ కాన్ లో ప్రెజెంటేషన్ ఇవ్వనుండగా..

హాలీవుడ్ కి వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రం విషయంలో ఇప్పుడు అంతకంతకు కూడా ఉత్కంఠ నెలకొనగా ఈ సినిమా అసలు ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న అయితే ఇప్పుడుకే పలు థియరీ లు అయితే ఈ సినిమా స్టోరీపై ఉన్నాయి.

ఇక ఈ చిత్రంపై లేటెస్ట్ గా వస్తున్నా అప్డేట్స్ ల అయితే ఆల్ మోస్ట్ ఓ క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. ఈ సినిమా కామిక్ – ఆర్ట్ విజన్ ద్వారా అయితే మేకర్స్ సినిమాలో స్టోరీలో కీలక పాయింట్ ని రివీల్ చేసారు. భూమిపై ఉండే సాధారణ మానవుల్ని బానిసలుగా చేసి వారిని తమ దేవునికి(సినిమాలో విలన్) కి దణ్ణం పెట్టి శరణు కోరమంటారు అయితే అలా కోరని ప్రజలని విలన్ సైన్యం చంపేస్తుంది.

మరి వారి నుంచి ఆ విలన్ నుంచి కాపాడడానికి వచ్చిన ఆ సూపర్ హీరో అనేది మెయిన్ కథ. అయితే ఇదే స్టోరీ మనం ఎన్నెన్నో హాలీవుడ్ సినిమాల్లో విన్నదే చూసిందే. మరి ఇదే రొటీన్ కాన్సెప్ట్ ని పట్టుకుని అయితే ఈ సినిమా యూనిట్ వస్తున్నారు. మరి ఇదే ఉండి ఇంకా ఏదన్నా మ్యాజిక్ గాని జరిగితే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి భారీ గుర్తింపు రావడం ఖాయం అని చెప్పొచ్చు. మరి దర్శకుడు నాగశ్విన్ మైండ్ లో ఏముందో ఏం చూపిస్తున్నాడో చూడాలి.