ఇరవై ఏండ్లకుపైగా హీరోయిన్ గా రాణిస్తూ అదే స్టార్‌డమ్‌ను అలానే కాపాడుకోవడం అనేది మాములు విషయం కాదు. కానీ హీరోయిన్ త్రిష మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో ఉంది. 40 ఏళ్ల త్రిష చేతిలో ఇప్పటికీ ఐదు సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుండగా త్రిషకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష.. ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని త్రిష అభిప్రాయపడుతున్నారు.
ఆమె వ్యాఖ్యలు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైమ్ నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. త్రిష కూడా విజయ్ కు మంచి ఫ్రెండ్ . మరి ఆమె భవిష్యత్తులో విజయ్ పార్టీలో చేరుతుందా లేకా కొత్త పార్టీ ఏమైనా పెడుతుందా అన్నది చూడాలి.ఇక తమిళనాడు అసెంబ్లీకి 2026 ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అక్కడ బలంగా ఉంది. ఇంతకుముందు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా రాణించింది. ఒక రకంగా ఆమె తమిళ రాజకీయాలని శాసించింది కూడా. ఆ తర్వాత చాలామంది మడిమణులు రాజకీయాలలో ప్రవేశించినా ఆమెలా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తానంటుంది ఆమెకి కూడా సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అది రాజకీయాలలో ఉపయోగపడుతుందో లేదో చెప్పటం కష్టమే. తెలుగులో చిరంజీవితో విశ్వంభరాశి సినిమాలో నటిస్తున్న త్రిష తమిళంలో అజిత్ సరసన విధాముయార్చి, గుడ్ బాడ్ అలీ సినిమాలలో నటిస్తుంది అలాగే కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక సూర్యతో మరో సినిమా కూడా చేస్తున్న త్రిష మలయాళం లో ఐడెంటిఫై సినిమాతో వెండి తెరపై కనిపించిన ఈ భామ ఇప్పుడు మరో సినిమాలో కూడా నటించబోతుంది.