చిత్రం శ్రీను కమెడియన్‌గా ఒకప్పుడు చాలా బిజీగా ఉండేవాడు. టాప్ కమెడియన్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ వెనక్కి వెళ్లిపోయాడు. శ్రీను వైట్ల సినిమాల్లో శ్రీను కామెడీ టైమింగ్ బాగానే క్లిక్ అయ్యేది. చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీను..వేణు, ధన్ రాజ్ కంటే సీనియర్. కానీ ఇప్పుడు చిత్రం శ్రీను వారికిందే పని చేయాల్సి వచ్చింది. అక్కడ జబర్దస్త్ షోలో ఇమడ లేక ఇప్పుడు అదిరింది షోలో ఏదో అలా నెట్టుకొస్తున్నాడు.
అయితే చిత్రం శ్రీనుకు ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, అశ్లీలత ఉన్న పాత్రలే ఇస్తుంటారు. అలా చిత్రం శ్రీనుపై ఓ రకమైన ఇమేజ్ ఏర్పడింది. స్కిట్స్, అందులోని పంచ్‌లు ఎంటర్టైన్మెంట్ కోసమే వేసినా పదే పదే అవే చేయడంతో అలాంటి ముద్రే పడుతుంది. అయితే చిత్రం శ్రీను ఆ ఇద్దరి కంటే ఎంతో సీనియర్ అయినా కూడా బొమ్మ అదిరిందిలో మాత్రం ఓ ఆర్టిస్ట్‌గానే ఉంటున్నాడు. తాజాగా ఈ క్రమంలోనే వేణుపై చిత్రం శ్రీను గురించి ఓ సెటైర్ పడింది.
వచ్చే ఆది వారంలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన బొమ్మ అదిరింది ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో వేణు, ధన్ రాజ్, చిత్రం శ్రీను మహారాజులుగా నటించారు. ఇందులో వేణు తన మహారాణి పోరును పడకలేకపోతుంటాడు. తన కాళ్లను పట్టమని మహారాణి వేణుకు ఆదేశం ఇస్తుంది.. నేను నీ కాళ్లు పట్టుకోవాలా? అని వేణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరవై యేళ్ల క్రితం చిత్రం శ్రీను అనే మహానుభావుడి కాళ్లు పట్టినట్టున్నారే అని గతాన్ని గుర్తుకు చేసి మరీ వేణు పరువుదీశారు.