ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో బ్రహ్మానందం లాంటి కమెడియన్ లేకుంటే ఓ వర్గ ఆడియెన్స్ అటు వైపు తిరిగి కూడా చూడరు. ఆయన ఎలాంటి కామెడీ పాత్రలు చేసినా కూడా ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం బ్రహ్మీ ఆస్తులపై కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మానందం చేసింది కామెడీ పాత్రలే అయినా కూడా రెమ్యునరేషన్ మాత్రం దాదాపు ఒక హీరోయిన్ జీతం కంటే ఎక్కువే ఉంటుంది. కాల్షీట్స్ ఎక్కువైనా కొద్దీ రెండు కోట్లకు పైగానే డీల్ సెట్ చేసుకునేవారట. రెమ్యునరేషన్ దగ్గర డబ్బులు విషయంలో బ్రహ్మానందం అస్సలు కామెడీగా ఉండరట. రంగుల ప్రపంచంలో జీవితాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో తెలియదు.
అందుకే వీలైనంత వరకు కష్టానికి ఫలితంగా వచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలని అనుకుంటారట. ఇక ఆయన ఎక్కువగా రియల్ ఎస్టేట్స్ వంటి వ్యాపారల్లోనే డబ్బులను ఇన్వెస్ట్ చేసినట్లు టాక్. ఇక ఆస్తుల విలువ 350కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఒకప్పుడు హైదరాబాద్ లో కొన్ని ల్యాండ్స్ ధర ఇప్పుడు అధికంగా పెరగడం వలన బ్రహ్మానందంకు అది బాగా కలిసొచ్చిందని టాక్.