అల్లు, మెగా కుటుంబాల మద్య కోల్డ్ వార్ ..?ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అల్లు అరవింద్..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు మాత్రమే సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాయి. మెగా కుటుంబం, అల్లు కుటుంబం నుండి వచ్చిన హీరోల మద్య సినిమాల విషయంలో గట్టి పోటీ నడుస్తోంది. అంతేకాకుండా వేరే కుటుంబాల మధ్య చాలా కాలం నుండి కోళ్లు వారు నడుస్తుందని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వార్తలపై నిజం లేదని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన కూడా ఇలాంటి వార్తలను ఆపలేకపోతున్నారు.

అంతే కాకుండా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నిరాకరించాడు. దీంతో వీరీ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నటిస్తోందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అల్లు అరవింద్ ఈ విషయంపై స్పందించాడు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మెగా కుటుంబం నుండి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. సినిమాల విషయంలో మెగా హీరోలకు అల్లు హీరోలకు పోటీ ఉండటం నిజమే. కానీ ఆ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమే.. అంటూ చెప్పుకొచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి అంటే అల్లు అర్జున్ కి అపారమైన గౌరవం అని, అల్లు అర్జున్ బ్రతికున్నంత కాలం ఆ అభిమానం అలాగే కొనసాగుతూ ఉంటుందని అల్లు అరవింద్ వెల్లడించాడు. మెగాస్టార్ అల్లు అర్జున్ కి దైవంతో సమానమని ఎప్పటికీ ఆయన మీద ఉన్న గౌరవం తగ్గదని ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలియ చేసి మెగా కుటుంబం, అల్లు కుటుంబం మద్య ఎటువంటి కోల్డ్ వార్ లేదనీ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు ఈ ఏడాది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇటు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఇక మెగా అభిమానులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.