ఐపీఎల్ 2025 సీజన్ క్లైమాక్స్‌కు రాగా… ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూస్తున్న ఫైనల్ మ్యాచ్‌కు ఇప్పుడు మిగిలిన పెద్ద అడ్డంకి వర్షమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోయే ఈ ఎగ్జయిటింగ్ ఫైనల్‌కు జూన్ 3న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. అయితే అదే సమయంలో నగర వాతావరణంలో అసహజత కనిపిస్తోంది. దాదాపు మూడు రోజులుగా మేఘాలు కమ్ముకున్న వాతావరణం.. ఫైనల్ జరగబోదన్న భయాన్ని కలిగిస్తోంది.
అహ్మదాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, జూన్ 3న మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వేడి పగటి వేళల్లో ఎక్కువగా ఉన్నా.. సాయంత్రానికి మేఘాలు కమ్ముకుంటూ తడిపే అవకాశం ఉందట. ఇదే జరిగితే మ్యాచ్ ఆలస్యం కావడం ఖాయం. ఒకవేళ వర్షం తారాస్థాయికి చేరితే మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం ఉంది. అయితే లీగ్ యాజమాన్యం ముందుగానే దీనిపై అప్రమత్తమయ్యారు. దీనికోసం రిజర్వ్ డే (జూన్ 4)ను సిద్ధం చేశారు.
ఇదే స్టేడియంలో గత సీజన్‌లోనూ వరుణుడి ప్రభావం తీవ్రంగా ఉండటం గుర్తుండాల్సిన విషయం. 2023లో గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ కూడా రిజర్వ్ డేకి వెళ్లింది. మళ్లీ అదే రిపీట్ నిరాశ తప్పదు. పైగా ఈసారి ఫైనల్‌కు వచ్చిన రెండు జట్లూ ఇప్పటివరకు ఒక్కటిసారి కూడా టైటిల్ గెలవలేదు. కాబట్టి ఇదే వారికో అవకాశంగా మారే అవకాశం ఉంది. అలాగే రిజర్వ్ డే రోజు వర్షం కారణంగా మ్యాచ్ పూర్తవకపోతే మాత్రం ఫలితంపై RCB కి దెబ్బె. ఎందుకంటే మ్యాచ్ జరగడానికి వీలు కలగకపోతే టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్ కు ట్రోపి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బెంగుళూరు అభిమానులు వాన కురవకూడదని, మ్యాచ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుకుంటున్నారు.