ఇండస్ట్రీ టాక్ : “కల్కి 2898ఎడి” రూమర్స్ పై క్లారిటీ.. 

ఈ ఏడాదిలో పాన్ ఇండియా సినిమా దగ్గర అదరగొట్టే భారీ చిత్రాల్లో ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం విడుదల కోసం ఫాన్స్ సహా ఇండియా ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ ని చిత్ర యూనిట్ ఈ మే 9కి లాక్ చేశారు.

కాగా ఈ సినిమాలో ఉలగనయగన్ కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి బీబీగ్ స్టార్స్ నటిస్తుండడంతో పాటుగా ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తుండడంతో సినిమాపై హైప్ ఆకాశాన్ని అంటింది. కాగా ఇప్పుడు టాలీవుడ్ లో మారుతున్నా కొన్ని పరిస్థితుల్లో అయితే ఈ సినిమా వాయిదా పడింది అంటూ కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.

కాగా ఇది వరకే జనవరి 12న రావాల్సిన ఈ సినిమా మే 9కి షిఫ్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా మారింది అంటూ కొన్ని వార్తలు నిన్న స్టార్ట్ కాగా దీనిపై కొన్ని ట్రస్టుడ్ వర్గాలు అప్డేట్ అందిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కల్కి చిత్రం అనుకున్నట్టుగా మే లోనే విడుదల అవుతుంది అని చెబుతున్నారు.

ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ కాగా గ్రాఫిక్ పనులు కూడా కంప్లీట్ అవుతున్నాయి. దీంతో మే 9 రిలీజ్ కి సిద్ధంగా ఉందని అంటున్నారు. కాగా ఈ భారీ చిత్రంలో దీపికా పదుకొనె అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కూడా నటిస్తున్నారు.