కుమార్తెకు సెల్యూట్ చేసిన తండ్రి … స్పందించిన మెగాస్టార్ !

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా సీఐ శ్యాంసుందర్ తన కుమార్తె, గుంటూరు అర్బన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి సెల్యూట్ చేయడం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన సందడి చేసింది. తిరుపతికి చెందిన శ్యాంసుందర్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా కల్యాణి డ్యామ్ పోలీసు శిక్షణ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె జెస్సీ ప్రశాంతి గుంటూరు డీఎస్పీ. రెండేళ్ల కిందట పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరిన ఆమె గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా పోలీస్ డ్యూటీ మీట్ సన్నాహాల్లో దర్శనమిచ్చి అందరినీ ఆకర్షించారు.

Chiranjeevi responds to father daughter salute incident in AP Police Duty Meet

 

కుమార్తె డీఎస్పీ కావడంతో ఆమెను తన పై అధికారిణిగా గుర్తించి తండ్రి సెల్యూట్ చేయడం అందరినీ అలరించింది. తండ్రి తనకు సెల్యూట్ చేయడంతో డీఎస్పీ హోదాలో ఉన్న జెస్సీ ప్రశాంతి తిరిగి సెల్యూట్ చేశారు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ దృశ్యం తాలూకు ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కుమార్తెను డీఎస్పీ హోదాలో నిలిపిన సీఐ శ్యాంసుందర్ ను అభినందించారు.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆ ఫొటోలో ఉంది తండ్రి-కూతురు అని, తండ్రి సీఐ శ్యాంసుందర్, కూతురు డీఎస్పీ మిస్ జెస్సీ ప్రశాంతి అని వివరించారు. తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ, తన పై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తిని, గర్వాన్ని, ప్రేమను చూశాను. శ్యాంసుందర్ గారూ, మీకు నేను సెల్యూట్ చేస్తున్నాను. మీ ఇద్దరూ ఇంకెందరికో స్ఫూర్తి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.