‘పుష్ప’లో తమిళ్ సూపర్ స్టార్ ని కూడా దింపేసారట! ఇక మాములుగా ఉండదు?

chiyan vikram will be the villan in puspha movie
chiyan vikram will be the villan in puspha movie
Pushpa

అల్లు అర్జున్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ”పుష్ప”. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న చిత్రం కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను కూడా తీసుకోవాలని ‘పుష్ప’ టీమ్ భావించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకమైన రోల్ లో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత లాక్ డౌన్ రావడం తో విజయ్ డేట్స్ మిస్ అయ్యాయి. దీంతో ఆయన ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఈ పాత్రలో నటించే యాక్టర్స్ అంటూ అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి.

Pushpa

తమిళ నటులు బాబీ సింహా – ఆర్య – సముద్రఖని – మాధవన్ – ఉపేంద్ర – సుదీప్ వంటి వారి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ను సంప్రదిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ గాసిప్ నిజమైతే మాత్రం సూపర్ కాంబోని తెరపై చూసే అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు. మరి చివరకు ఈ క్యారక్టర్ కోసం ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి. కాగా కరోనా లాక్ డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతం మారేడుమిల్లి అభయారణ్యంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బన్నీ ‘పుష్ప రాజ్’ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో మాసిన దుస్తులు.. గుబురు గడ్డం.. భిన్నమైన హెయిర్ స్టైల్ తో మొరటు కుర్రాడిగా బన్నీ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.