పాపం చిత్రం శ్రీను.. అటు ఇటు కాకుండా అయిపోయాడు!

Chitram Seenu in Bomma Adirindhi

చిత్రం శ్రీను ఒకప్పుడు స్టార్ కమెడియన్. కామెడీ కేరాఫ్ అడ్రస్‌గా చిత్రం శ్రీను వెండితెరపై ఓ రేంజ్‌లో వెలిగాడు. కానీ రాను రాను చిత్రం శ్రీను ఫేడవుట్ అవుతూ వచ్చాడు. చివరకు బుల్లితెరపై కనిపించడం ప్రారంభించాడు. సీరియల్స్‌లోనూ చిత్రం శ్రీను నటిస్తున్నాడు. అయితే వీటికంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ షోల్లో కనిపిస్తున్నాడు. వెండితెరపై వెలిగిన స్టార్స్.. జబర్దస్త్, అదిరింది వంటి షోల్లో సందడి చేస్తున్నారు.

Chitram Seenu in Bomma Adirindhi
Chitram Seenu in Bomma Adirindhi

చిత్రం శ్రీను.. ధన్ రాజ్, వేణు కంటే సీనియర్. కానీ ప్రస్తుతం మాత్రం చిత్రం శ్రీను.. ఆ ఇద్దరి కింద కంటెస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆ ఇద్దరూ తనను ఎలా వాడుకుంటారో తాజాగా చెప్పుకొచ్చాడు. మామూలుగా ధన్ రాజ్ వేసే ఆశ్రమం బాబా స్కిట్‌లో చిత్రం శ్రీను అడల్ట్ జోకులు వేస్తుంటాడు. తాజాగా ధన్ రాజ్, వేణు తనను ఎలా బురిడి కొట్టిస్తాడో స్కిట్ వేసి చూపించాడు.

శ్రీనన్న నీ కోసం మంచి క్యారెక్టర్ రాశాను అన్నా త్వరగా వచ్చేయ్ అని వేణు అంటాడట. తీరా వచ్చాక.. ఆ సూపర్ పాత్ర నేను వేస్తున్నా.. నీ కోసం ఓ చిన్న పాత్ర చేశాను అని మాట మార్చేస్తాడట. ఇక ధన్ రాజ్ తన స్కిట్‌లతో, డైలాగ్‌లతో తను ఇమేజ్ మొత్తం మార్చేశాడని వాపోయాడు. పాపం చిత్రం శ్రీను ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాడో తలుచుకుంటుంటే జాలేస్తుంది.