కరోనా కోరలు చాచడం వలన సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. షూటింగ్స్ స్తంభించడం, థియేటర్స్ మూతపడడంతో నిర్మాతలు, థియేటర్ మాన్యాలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం థియేటర్స్ తెరచుకోవచ్చని ఎప్పుడో అనుమతులు ఇచ్చిన కూడా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారో లేదో అనే మీమాంసతో ఇన్నాళ్ళు థియేటర్స్‌ని మూసే ఉంచారు. అయితే క్రిస్మస్ కానుకగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ తన సినిమాని థియేటర్స్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. లాక్ డౌన్ తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ మూవీకి ఎంత ఆదరణ లభిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఒక రకంగా రిస్క్ చేసి థియేటర్లో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని విడుదల చేస్తున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు. క్ర్మిస్మస్కి విడుదల అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిలిం ఇండస్ట్రీకే ముఖ్యమైన సందర్భం. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా ప్రేక్షకులు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయల్సిందిగా కోరుతున్నాను అంటూ చిరు ట్వీట్ చేశారు.
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న సుబ్బు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నో పెళ్ళి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రానా, వరుణ్ తేజ్, నితిన్ కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. కాగా, తేజూ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే
#StaySafe#SBSBOnDec25th#CelebratingCinema#ReturnOfTeluguCinema #BigScreenEntertainment @IamSaiDharamTej @SVCCofficial pic.twitter.com/NrKwy4u3r0
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2020