సుకుమార్ కి చిరు ఇచ్చిన గిఫ్ట్ ధర ఎంతో తెలుసా?

ఉప్పెన .. మెగా మేనల్లుడు నటించిన వైష్ణవ్ తేజ్ నటించిన తోలి చిత్రం. డెబ్యూ చిత్రమైనప్పటికీ ఉప్పెన బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా విజయంలో హీరోయిన్ బేబమ్మ కూడా తనవంతు పాత్ర పోషించింది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాకి మరో ప్రధాన అసెట్.

ఈ నేప‌థ్యంలో ఆ సినిమా యూనిట్ లోని కీలక సభ్యులకు చిరంజీవి బహుమతులు, అభినందన లేఖలు పంపించారు. త‌న‌కు కూడా మెగాస్టార్ నుంచి బ‌హుమ‌తి అందింద‌ని తెలుపుతూ సుకుమార్ ట్వీట్ చేశారు. స్పెయిన్‌ సంస్థ లాడ్రో విక్రయిస్తున్న ది థ్రిల్‌ ఆఫ్‌ లవ్‌ కపుల్‌ ఫిగరైన్ బొమ్మలను అందుకున్న‌ట్లు చెబుతూ వాటి ఫొటోల‌ను సుకుమార్ పోస్ట్ చేశారు. సముద్రం ఒడ్డున మోకాళ్లపై కూర్చుని ప్రేమ‌లో మునిగిపోయిన‌ జంట బొమ్మలను అందుకున్నాన‌ని చెప్పారు.

వాటి రేటు రూ.89 వేలు ఉంటుంది. కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా అంటూ తాను చిన్న‌ప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ఆయ‌న నుంచి ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి క‌లుగుతోందంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఈ సినిమా కీల‌క‌ దృశ్యాలను స‌ముద్ర అందాల న‌డుమ తీశారు. ఈ నేప‌థ్యంలోనే చిరు ఇటువంటి బొమ్మ‌ను పంపారు.