చిరు ఒక్క దెబ్బతో అందరి అసలు రంగులు బయటకి.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సీనియర్ నటుడు ఇప్పటికీ నెంబర్ 1 హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “భోళా శంకర్”. కాగా ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రాబోతుండగా దీనికి ముందు చిరు భారీ హిట్ అందుకున్న “వాల్తేరు వీరయ్య” సినిమా 200 రోజుల విజయ వేడుకలో అయితే మెగాస్టార్ చేసిన కొన్ని పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు ఒక్కసారిగా దుమారాన్ని రేపి వదిలేశాయి.

కాగా ఈ కామెంట్స్ తో ఇప్పుడు అసలు ఆట స్టార్ట్ అయ్యింది. ఇన్ని రోజులు చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ పై తాము మెగాస్టార్ ఫ్యాన్స్ అని చెప్తూ పవన్ కళ్యాణ్ ని విమర్శించే వారి ఫ్యానిజం కి పని పడింది. చిరు అన్న కామెంట్స్ లో ఎలాంటి నొచ్చుకునే అంశం లేకపోయినప్పటికీ చిరంజీవి పై వైసీపీ కి చెందిన కొందరు మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు.

దీనితో ఇన్ని రోజులు చిరంజీవికి కరుడుగట్టిన ఫ్యాన్స్ అని చెప్తూ పవన్ ని వైసీపీ తో కలిసి విమర్శించే వారికి సరైన కష్టతర సమయం వచ్చింది. దీనితో మరి వారు ఇప్పుడు చిరు సైడ్ ఉంటారా లేక వైసీపీ సైడ్ ఉంటారా అనేది చూస్తే ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో చిరంజీవి డీపీ పెట్టుకున్న ఏ ఒక్కరు కూడా మెగాస్టార్ కి మద్దతుగా లేకపోగా పై పెచ్చు ఇన్నాళ్లు మెగాస్టార్ ని పొగిడిన వారు అంతా ఒక్కసారిగా రివర్స్ అయిపోయారు.

దీనితో చిరంజీవి ఫోటో పెట్టుకొని కావాలని పవన్ ని తిట్టే వారి అసలు రంగులు బయట పడ్డాయి అని పవన్ సహా మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అంటున్నారు. కొందరు ఇకనైనా అంతా తెలుసుకోవాలి అని మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఇది ఇప్పుడు ఎక్స్ పోజ్ అయ్యింది అని పవన్ సినీ మరియు పొలిటికల్ ఫ్యాన్స్ అంటున్నారు. దీనితో చిరు ఒక్క దెబ్బతో తన ఫ్యాన్స్ అని చెప్పుకుని తిరుగుతున్నా ముసుగు ఫ్యాన్స్ అసలు రంగులు ఇపుడు బయట పడ్డట్టు అయ్యింది.