ఇప్పుడు టాలీవుడ్‌ల్ స్టార్ స్టేటస్ కొలిచే పద్దతి మారిపోయింది. ఒకప్పుడు ఎన్ని రోజులు ఆడిందో ఎన్ని సెంటర్లలో ఆడింది అనేది లెక్కలోకి తీసుకునేవారు. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది అని బేరీజు వేసుకుంటారు. అలా వందల కోట్లు కలెక్ట్ చేసేవారినే స్టార్స్ అంటున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటే వారే స్టార్స్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో పుకార్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.
గత రెండు రోజులుగా చిరంజీవి రెమ్యూనరేషన్‌పై పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆచార్యకు యాభై కోట్లు తీసుకున్నాడని వార్తలు రావడం ఇక తరువాత చేయబోయే వేదాళం సినిమాకు అరవై కోట్లు తీసుకోబోతోన్నాడని రూమర్లు హల్చల్ చేశాయి. అసలు ఖైదీ నెంబర్ 150, సైరా రెమ్యూనరేషన్స్ బయటకు రాలేద. రావు కూడా. ఎందుకంటే అవి సొంత బ్యానర్స్. ఆచార్య కూడా సొంత బ్యానరే. అసలు ఈ చిత్రాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్నది ఎప్పటికీ బయటకు రాదు. ఎందుకంటే ఎంత ఇచ్చినా ఏం ఇచ్చినా అందులోనే ఉంటాయి.
ఇక వేదాళం సినిమా ఇంకా మొదలే కాలేదు. అసలు ఇంకా పూర్తి స్క్రిప్ట్, దానిపై సిట్టింగ్ కూడా కాలేదు. ఆచార్య గతే ఇంకా ఎటూ తేలడం లేదంటే ఇప్పుడు కొందరు వేదాళం రెమ్యూనరేషన్స్‌పై వార్తలు వడ్డించేశారు. నిజానికి.. ఈ సినిమా ఇంకా పైప్ లైన్‌లోనే ఉంది. ఎవరికి ఎంత పారితోషికం అన్నది ఫిక్స్ అవ్వలేదు. పారితోషికం విషయంలో నిర్మాతలకూ, చిరుకీ మధ్య ఎలాంటి బేరసారాలూ జరగలేదట. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చిరు సినిమా చేయడం ఖాయమైంది. అంతే తప్ప.. పారితోషికం ఇంత అని ఫిక్సవ్వలేదని వినిపిస్తోన్న టాక్. ఈ రెమ్యూనరేషన్ విషయంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారన్న సంగతి తెలిసిందే.