జేమ్స్ కెమరూన్‌తో చిరంజీవి భేటీ.?

మెగాస్టార్ చిరంజీవి త్వరలో జేమ్స్ కెమరూన్‌ని కలవబోతున్నారట. ఇటీవల జేమ్స్ కెమరూన్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడుతూ, అందులోని రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన కుమారుడికి దక్కిన ఈ అరుదైన ప్రశంసని ‘ఆస్కార్’తో పోల్చేశారు. పుత్రోత్సాహం అలాంటిది మరి.! ఇదిలా వుంటే, చరణ్ ఇప్పటికే జేమ్స్ కెమెరూన్‌తో ఇంటరాక్ట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ ప్రముఖులతో జేమ్స్ కేమరూన్ ఇప్పటికే ఇంటరాక్ట్ అయ్యారు.. అదీ విదేశాల్లో. ఇది ఇంటర్నెట్ యుగం కదా..

వీడియో కాల్ ద్వారా.. జేమ్స్ కెమరూన్, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో విడివిడిగా ఇంటరాక్ట్ అయినట్లూ ప్రచారం జరుగుతోంది. కాగా, చరణ్‌ని వెంటేసుకుని చిరంజీవి విదేశాలకు వెళ్ళబోతున్నారనీ, జేమ్స్ కేమరూన్ పిలుపుతో చిరంజీవి ఆయన్ని కలిసేందుకు సమాయత్తమవుతున్నారనీ అంటున్నారు.

ఈ విషయం లీక్ అవడంతో, చిరంజీవికి వ్యతిరేకంగా ఓ వర్గం మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.