ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరు సోదరి మణులు ఇలా లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. చిరు పెద్ద కూతురు సుష్మిత, చిన్న కూతురు శ్రీజ ఫ్యామిలీలు ఇలా అందరూ కలిస్తే ఆ రచ్చే వేరుగాఉంటుంది. ఇక తాతగా చిరు ఆనందించి మురిసేపోయే క్షణాలు చాలానే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్ల ప్రతిభను చూసి ఎంతగా మురిసిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీజ పెద్ద కూతురు నివృత్తి, నవిష్కల అల్లరి చేసే విధానానికి సంబరపడిపోతాడు. ఆ మధ్య నివత్తి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతూ రిలీజ్ చేసిన వీడియోలు, ప్రపంచ వాతావరణ దినోత్సవం నాడు చెప్పిన సందేశాలను చిరు చూసి ఎంతో మురిసిపోయాడు. తాజాగా చిరు పెద్ద కూతురు సుష్మిత కుమార్తె ప్రతిభను చూసి ముగ్దుదయ్యాడు.
రుద్రమదేవి పాత్రలో నటించి, ఎంతో గంభీరంగా డైలాగ్‌లు చెప్పింది. రుద్రమదేవి సినిమాలో అనుష్క చెప్పినట్టుగా డైలాగ్‌లు చెప్పి అదరగొట్టేసింది. చివర్లో కత్తి పట్టి మరి దూసింది. ఇక చిరంజీవి ఈ వీడియోను షేర్ చేస్తూ తాతగా మురిసిపోయాడు. చిన్నారుల అభిరుచిని తల్లి తండ్రులు ప్రోత్సహిస్తే, అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అంటూ సుష్మిత కొణిదెల కూతురు సంహిత అంటూ చెప్పుకొచ్చాడు.