‘భోళా శంకర్’కి అతుకులు ఎక్కువైపోతున్నాయ్.!

‘వాల్తేరు వీరయ్య’కి ముందు.. ఆ సినిమా తర్వాత.. అన్నట్టుంది మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి. ‘భోళా శంకర్’ సినిమా మీద భారీ అంచనాలతో వస్తారు థియేటర్లకి ఆడియన్స్. నిజానికి, ‘వాల్తేరు వీరయ్య’ స్ట్రెయిట్ ఫిలిం.. అంతకు ముందు చేసింది రీమేక్.. అదే ‘గాడ్ ఫాదర్’. ‘భోళా శంకర్’ మళ్ళీ రీమేక్ సినిమా. మెహర్ రమేష్ దర్శకుడు. ఎప్పుడో ప్రారంభమైన సినిమా.. ముక్కీ మూలిగీ ముందుకు కదులుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ వచ్చాక, సినిమా నిర్మాణంలో వేగం పెరిగింది.

అయితే, అంతకు ముందు తీసిన కొన్ని సీన్స్‌ని మళ్ళీ రిపెయిర్ చెయ్యాల్సి వస్తోందట. కొన్ని సీన్లయితే పూర్తిగా రీ-షూట్  చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే వ్యవహారం అతుకుల బొంత అయిపోతుందేమోనన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి.

ఈ సినిమాలో తొలుత సాయి పల్లవిని చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం అనుకున్నారు. ఆమె ‘నో’ చెప్పడంతో, కీర్తి సురేష్‌కి ఆ ఛాన్స్ దక్కింది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రత్యేకంగా ఈ సినిమాకి సంబంధించి అతుకులేసే పనిలో నిమగ్నయ్యారన్నది తాజా ఖబర్.