లేటెస్ట్ : పవన్ పై చిరంజీవి పొలిటికల్ విషెష్..

Chiranjeevi Doing Politics Behind Screen For Pawan

ఈరోజు టాలీవుడ్ లో ఉన్న ఎన్నో లక్షల మందికి ఆరాధ్య దైవమ్ అలాగే తెలుగు నాట ఓ పెద్ద సూపర్ స్టార్ మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా అయితే ఇప్పుడు అంతా రచ్చ నడుస్తుంది. కాగా పవన్ కి సినీ వర్గాలు సహా రాజకీయాలు నుంచి కూడా అనేకమంది బర్త్ డే విషెష్ ని చెప్తుండగా..

మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా బిగ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విషెష్ చెప్పడం మామూలే కానీ ఈసారి శుభాకాంక్షల్లో పొలిటికల్ షేడ్ ని పెట్టడం మరింత ఆసక్తిగా ఎగ్జైటింగ్ గా ఫ్యాన్స్ కి మారింది. మరి తాను నాగబాబు అలాగే పవన్ కలిసి కూడా ముగ్గురు పిక్ పెట్టి.

డియరెస్ట్ కళ్యాణ్ బాబు అంటూ స్టార్ట్ చేసి జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా, నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు , గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, నీకు జన్మదిన శుభాకాంక్షలు! అంటూ మెగాస్టార్ ముగించారు.

దీనితో చిరు తన సంపూర్ణ మద్దతు తమ్ముడికి తప్ప ఇంకెవరికి లేదు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఇది ఉందని చెప్పాలి. దీనితో ఈ పోస్ట్ దెబ్బకి ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తుండగా సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. ఇక మరో పక్క పవన్ ఫ్యాన్స్ తన సినిమాలు పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నారు.