చెర్రీ కోసం రంగంలోకి దిగుతున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు!

గేమ్ చేజర్ మూవీ సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మూవీ టీం. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఓ రేంజ్ లో ఈవెంట్స్ చేస్తూ సినిమాకి హైప్స్ తీసుకొస్తున్నారు. ఈ మధ్యనే డల్లాస్ లో జరిగిన ఈవెంట్ సూపర్ హిట్ అయింది. దాంతోపాటు మొన్న విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ ఫ్యాన్స్ ఏర్పాటు చేయగా దానిని నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.

అప్పుడే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఇచ్చే సమయాన్ని బట్టి ఫ్రీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది చెప్తామని చెప్పారు దిల్ రాజు. అయితే జనవరి 1, 2025న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఈ ఈవెంట్ ని చిరంజీవి చేతుల మీదుగా చేయించాలని చూస్తున్నారట గేమ్ చేంజర్ మూవీ యూనిట్.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు మెగా హీరోలు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. ఒక రకంగా ఇది మెగా ఈవెంట్ లా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు మూవీ యూనిట్.

మెగా ఫ్యాన్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఇండియన్ టు ఫ్లాప్ అవటంతో ఈ సినిమా విజయం సాధించటం అనేది డైరెక్టర్ శంకర్ కి చాలా అవసరం అలాగే పుష్ప 2 తో ఘనవిజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తో రామ్ చరణ్ ని కంపేర్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ కాబట్టి అతనికి కూడా ఈ సినిమా విజయం చాలా అవసరం. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలి.

LIVE : గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌కు చిరంజీవి, పవన్ కల్యాణ్ | Game Changer | Ram Charan | Chiranjeevi