మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అనే సినిమా అన్ని భాషలలోనూ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. అమీర్ ఖాన్, రాధిక చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా తెలుగు టీజర్ ని విడుదల చేశారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో చిరంజీవి కూడా హాజరై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ మీడియా సమావేశంలో అమీర్ ఖాన్ చిరంజీవితో పాటు అక్కినేని నాగచైతన్య కూడా హాజరయ్యారు. ఈ మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ అమీర్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ చేసే పాత్రలు నాకు వస్తే నేను కచ్చితంగా చేయను. నేను ఏం చేస్తే ప్రేక్షకులు క్లాప్ కొడతారు, జై జై లు కొడతారు అని చూసి నేను సెలెక్టివ్ గా ప్లాన్ చేసుకుంటాను. కానీ అమీర్ ఖాన్ అలాగ కాదు. తనకి వచ్చి క్యారెక్టర్లు ఏవైనా నాకు వస్తే నేను వాటిని కచ్చితంగా చేయను. అమీర్ ఖాన్ మాత్రం ఆ పాత్రలలో జీవిస్తుంటాడు. అమీర్ ఖాన్ ధైర్యం చేసి ఆ పాత్రలు నచ్చేలా నటిస్తాడు. కానీ నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే కొన్ని సందర్భాలలో నా ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి వాటి గురించి మీరు అడగకండి అంటూ విలేకరులతో ముచ్చటించాడు. ఇదిలా ఉండగా.. మన టాలీవుడ్ డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ.. మన దర్శకుడు సెట్ లోనే డైలాగు రాసి ఇస్తారు వాటిని నేర్చుకోవాలా? లేక వాటి మీద దృష్టి పెట్టాలో అర్థం కాదు అంటూ వెల్లడించాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో నా ప్రమేయం లేకుండా కొన్ని సినిమాలలో నటించాల్సి వస్తుంది అటువంటి వాటి గురించి మీరు ప్రత్యేకంగా ద్వేషించాల్సిన పనిలేదు అంటూ వెల్లడించాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.