స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి రాజమౌళి ఏ సినిమా చూసినా మీకు ఈ నటుడు కనిపిప్తాడు. రాజమౌళి ప్రతి సినిమాలో ఈ నటుడికి మంచి వేషం ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు శేఖర్. తమిళంలోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు శేఖర్.
తెలుగులో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన సినిమా కెరీర్ ను ప్రారంభించిన శేఖర్… తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, అశోక్, విక్రమార్కుడు, ఢీ, మగధీర, శక్తి, లెజెండ్, మర్యాదరామన్న, కిక్ 2 లాంటి ఎన్నో సినిమాల్లో నటించాడు.
ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ నటిస్తున్నాడు శేఖర్. అయితే.. శేఖర్ గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఆయన భార్య గురించి. అవును.. ఆయన భార్య ఎవరో కాదు.. ఆయన భార్య కూడా నటిగానే ఉన్నారు. ఆమె పేరు నీల్యా భవాని. సినిమాలతో పాటు పలు సీరియళ్లలోనూ ఆమె నటిస్తుంటారు.
తెలుగులో పండగ చేస్కో, సైరా నరసింహరెడ్డి, శంకర, రన్ రాజా రన్.. సినిమాల్లో ఆమె నటించారు. తెలుగు సీరియళ్లలోనూ నటించారు.
అయితే.. కొన్ని సంవత్సరాల క్రితమే వ్యక్తిగత కారణాల వల్ల వీళ్లిద్దరూ విడిపోయారు. శేఖర్, నీల్యాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి. పిల్లలు కూడా పెద్దవాళ్లే. ప్రస్తుతం పిల్లలు శేఖర్ తోనే ఉన్నట్టు తెలుస్తోంది.