డైరెక్టర్ పూరీ జగన్నాద్, ఛార్మీల మధ్య ఉన్న సంబంధం గురంచి ఇండస్ట్రీలో రకరకాలు కామెంట్లు, గుసగుసలు వినిపిస్తుంటాయి. సోషల్ మీడియాలో వీరిద్దరిపై గట్టిగానే ట్రోల్స్ వస్తాయి. డ్రగ్స్ కేసులో ఇద్దరూ ఆ మధ్య రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పూరీ గ్యాంగ్ మొత్తం డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. అయితే ఆ కేసు ఇప్పుడు ఏ మూలన పడిందో ఎవ్వరికీ తెలీదు. ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే నేడు (సెప్టెంబర్ 28) పూరి జగన్నాద్ బర్త్ డే. ఇండస్ట్రీలో ప్రముఖలందరూ పూరికి విషెస్ చెబుతున్నారు.
ఛార్మీ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. మామూలుగా అందరిలా చెబితే ఆమె ఛార్మి ఎందుకు అవుతుంది. పూరిపై ఉన్న ప్రేమ కనబడేలా చెప్పింది. మిలియన్ల కొద్దీ హార్ట్స్ ఉన్న వ్యక్తి అంటూ పొగిడేసింది. నా సంరక్షకుడు, నా బెస్ట్ ఫ్రెండ్, జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి, మంచి వ్యాపార భాగస్వామి అంటూ పూరిని పలు రకాలుగా కీర్తించింది ఛార్మీ. ఎప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.
నా డైరెక్టర్ పూరి జగన్నాద్‌కు హ్యాపీ బర్త్ డే. నిన్ను గర్వంగా తలెత్తుకునేలా చేయడానిక ప్రయత్నిస్తాను.. మరంత దూసుకెళ్దాం అంటూ పూరిపై ఉన్న అంతులేన ప్రేమను ఇలా చూపించింది. తన మేనేజర్ చేతిలో మోసపోయి పూరి మొత్తం కోల్పోయి రోడ్డు మీద పడ్డ సమయంలో ఛార్మీ వచ్చింది. అప్పటినుంచి పూరి జగన్నాద్ వ్యవహారాలన్ని ఛార్మీనే చూస్తోంది. పూరీ కనెక్ట్స్ బాధ్యతలన్నీ ఛార్మీనే నెత్తిన వేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో ఈ ఇద్దరికి మళ్లీ పున: వైభవం వచ్చింది. ప్రస్తుతం ఫైటర్ సినిమాతో వీరిద్దరూ బిజీగా ఉన్నారు