Jr NTR: అర్ధరాత్రి 12 గంటలకు చరణ్ మా ఇంటి ముందుకి వచ్చేవాడు… ఇద్దరం కలిసి అక్కడికి వెళ్లేవాళ్లం…!

Jr NTR: మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్ కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు భారీగానే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్…గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.

అయితే రామ్ చరణ్, తారక్ కేవలం తెరమీదే స్నేహితులుగా ఉంటారా.. లేదంటే తెర వెనకాల కూడా ఇలానే ఉంటారా అన్న సందేహాన్ని వారు బద్దలుకొట్టారు. తామిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని, ఎలా అంటే భిన్న ధృవాలు ఆకర్షిస్తాయి కదా అని అని వారు చెప్పుకొచ్చారు. మార్చి 26న తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు అని, మార్చి 27న చరణ్ బర్త్‌డే అన్న తారక్, 26వ తేదీ అర్థరాత్రి 12 గంటలయ్యిందంటే చాలు, తాను గేటు దగ్గర ఉండేవాడినని, చరణ్ కారు రాగానే అందులో ఎక్కేసి ఇద్దరం కలిసి వెళ్లిపోయేవారమని ఆయన చెప్పారు. ప్రణతి ఫోన్ చేసి నా బర్త్‌డే కదా, ఎక్కడున్నావ్ అని అడిగతే పన్నెండు దాటింది., నీ బర్త్‌డే అయిపోయింది అని చెప్పేవాడినని ఎన్టీఆర్, చరణ్‌తో ఉన్న సన్నిహిత్యాన్ని గురించి సరదాగా చెప్పారు.

కాగా ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏తో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. నందమూరి, మెగా హీరోలను ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి హీరోల అభిమానులే కాదు యావత్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా ట్రైలర్, పాటలు విడుదల చేయడంతో ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించగా ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.