Project K: ప్రాజెక్ట్ కే లో ప్రభాస్, దీపికల పాత్రలేంటంటే…?

Project K:రాధేశ్యాం సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కే కూడా ఒక చిత్రం. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సలార్ ,ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాలలో అత్యంత ఆసక్తి కలిగిన చిత్రం ప్రాజెక్టు కె. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసమే ఏడాదికాలం కేటాయించారు. ఈ సినిమాని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటి వరకు ఎవరు చెయ్యని కొత్త కాన్సెప్ట్ ను ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఎంచుకున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రలో హాలీవుడ్ దిగ్గజ నటుడు అయిన అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు టాపిక్ గా నిలుస్తున్నాయి.ఇప్పుడు ప్రభాస్, దీపికా ప‌దుకొణెల పాత్ర‌ల‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో బిగ్ బీ, ప్ర‌భాస్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారట. తండ్రి పేరు అశ్వ‌ద్ధామ‌. ఆయ‌నో పెద్ద వ్యాపార వేత్త‌ అని,త‌న‌కు స‌హాయ‌కురాలి పాత్ర‌లో దీపికా ప‌దుకొణె నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఒక తండ్రి తన కొడుకు కోసం ఏం చేస్తారు అనేదాని గురించి కథ ఉంటుందట. టైం మెషిన్ నేపథ్యంలో ఈ కథ మొత్తం వెళ్తూ కాలాన్ని ఆపడం భవిష్యత్తులో కి వెళ్లడం ఇలాంటివన్నీ ఈ కథలో ఉంటాయట.

అంతేకాకుండా ప్రాజెక్ట్ కే అనేది ఈ సినిమా పేరు కాదు, ఈ సినిమాలోని ప్రభాస్ పాత్ర పేరు కే అనే అక్షరం తో మొదలు కావడంతో ఈ సినిమాకి ప్రభాస్ పేరుని టైటిల్ గా పెడతారు, అని ఇన్సైడ్ వర్గాల టాక్.