ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్.. హీరోయిన్ ఐశ్వర్య శర్మ కామెంట్స్!

బ్రాండ్ ఆఫ్ బాడ్ బాయ్స్ అనే టాగ్ లైన్ తో తిరుమల శెట్టి కిరణ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డ్రింకర్ సాయి. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ఎవరెస్టు సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పథకాలపై బసవరాజు శ్రీనివాస్, బసవరాజు లహరిధర్,ఇస్మాయిల్ షేక్ నిర్మిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న రిలీజ్ కి సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా కథానాయక ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ సినిమా గురించి, తన క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. మా నాన్న రంగస్థలం నటుడు, నాకు తెలియకుండానే ఆయన ప్రభావం నా మీద పడటం వలన చిన్నప్పటినుంచి ఆర్టిస్ట్ కావాలని కోరిక ఉండేది. 12th కంప్లీట్ చేసిన తర్వాత జమ్మూ నుంచి ముంబైకి వెళ్లి అక్కడ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. కోర్సు పూర్తయ్యాక ఆడిషన్స్ ఇవ్వటం మొదలుపెట్టాను.

ఇంతకుముందు ఎలాంటి వెబ్ సిరీస్ లోను, షార్ట్ ఫిలిమ్స్ లోను నటించలేదు కానీ కొన్ని ప్రకటనలలో మాత్రం నటించాను. ఇప్పుడు డ్రింకర్ సాయి సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేస్తున్నాను అని చెప్పింది. అలాగే సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర పేరు భాగి. మొదట కథ విన్నప్పుడు ఇది చాలా బలమైన పాత్ర అనిపించింది ఈ పాత్రకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకి భాగి పాత్ర భిన్నంగా ఉంటుంది.

అందుకే ఈ స్టూడెంట్ క్యారెక్టర్ సవాల్ గా అనిపించింది. అయినా నేను ఆ క్యారెక్టర్ ని ఉత్సాహంతో చేశాను. హీరో ధర్మతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు తెలియకపోవటం వలన డైలాగ్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. హీరో ధర్మ ఈ విషయంలో నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే అర్జున్ రెడ్డి సినిమాకి మా సినిమాకి ఎలాంటి పోలిక లేదు, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ పూర్తి మాస్ వెర్షన్ అయితే డ్రింకర్ సాయి ది క్లాస్ వెర్షన్ అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.