చంద్రముఖి -2 ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు…!

చంద్రముఖి సినిమాకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి సినిమాకు సీక్వెల తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌ ఏ రేంజ్‌లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా దెయ్యాలకు శరీరాన్ని అప్పుగా ఇచ్చే లారెన్స్‌.. ఇందులో హీరోగా చేస్తుండటంతో జనాల్లో కాస్త క్యూరియాసిటీ పెరిగింది.

ఇక తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న గ్రాండ్‌ లెవల్లో రిలీజ్‌ చేస్తుండగా.. టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్‌ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్‌ మరో సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

రెండు వారాల కిందట ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల కాగా అది ప్రేక్షకులను కొసమెరుపు కూడా ఆకట్టుకోలేకపోయింది. దానికి తోడు ట్రోలర్‌ రాయుళ్లకు కావాల్సిన స్టఫ్‌ అంతా ట్రైలర్‌లోనే కనిపించింది. ఇక కథ కూడా ఏ మాత్రం మార్చినట్లు లేదు. అదే కథను 4కేలో చూపించబోతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఈ మూవీపై ఉన్న నెగిటివ్‌ బజ్‌ను పోగొట్టడానికి ఈ మూవీ నుంచి కొత్త ట్రైలం విడుదల కానుంది.

ఈ విషయాన్ని మేకర్స్‌ సోషల్‌ విూడియాలో తెలిపారు. ఈ కొత్త ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే చంద్రముఖి 2 బజ్‌ అంతా సెకండ్‌ ట్రైలర్‌ పైనే డిపెండ్‌ అయ్యుందేమో అని ఆడియన్స్‌ భావిస్తున్నారు.