తెలుగు తెరపై తెలుగమ్మాయిలు స్టార్డం తెచ్చుకోవడమన్నది అంత ఈజీ కాదు. మన వాళ్లు బొంబాయి, ఉత్తరాది భామలను మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. తెలుగమ్మాయిలకు అంతగా చాన్సులు ఇవ్వరు. ఇచ్చినా హీరోయిన్ క్యారెక్టర్లు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంటాయి. అయితే ఈ మధ్యే ఇది మారుతోంది. తెలుగు అమ్మాయిలైనా ఈషా రెబ్బా, ప్రియాంక జవాల్కర్, చాందినీ చౌదరి వంటి వారు సిల్వర్ స్క్రీన్‌పై రచ్చ చేస్తున్నారు.
అయితే తెలుగమ్మాయింటే ఓ అపోసహ ఉంటుందని, ఓ అభిప్రాయానికి వచ్చేస్తుంటారని చాందినీ చౌదరి చెప్పుకొచ్చింది. ఇటీవలె కలర్ ఫోటో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న చాందినీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తెలుగమ్మాయిలు అన్ని రకాల పాత్రలు పోషించలేరు.. చాలా పరిమితులుంటాయని దర్శక నిర్మాతల్లో మొదటి నుంచీ ఓ అపోహ ఉందని చాందినీ చెప్పుకొచ్చింది.
అయితే అది వాస్తవం కాదని… నిజానికి బయట భాషల నుంచి వచ్చే నాయికల్లోనూ ఎక్స్‌పోజింగ్‌కి, మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవడానికి ‘నో’ చెప్పే వాళ్లున్నారని తెలిపింది. ఆ ముద్ర తెలుగమ్మాయిలకే ఎందుకు ఆపాదిస్తారన్నది నాకిప్పటికీ అర్థం కాదని చాందిని చౌదరి చెప్పుకొచ్చింది. అందం.. అభినయం.. ఇలా ఏ రకంగా చూసినా ఇప్పుడొస్తున్న తెలుగమ్మాయిలు బయట నాయికలకు ఏమాత్రం తీసిపోవడం లేదని పేర్కొంది.