Niharika: నిహారికకు ఒక్కక్షణం అది లేకపోతే ఉండలేదు అంటూ తన గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన భర్త చైతన్య?

Nihaarika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక గత ఏడాది డిసెంబర్ 9 వ తేదీ జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా పిచ్చి ఉండటంతో ఈమె నిర్మాతగా మారి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ నిర్మించారు.ఇక ఈమె వివాహం చేసుకొని మరికొద్ది రోజులలో ఒక ఏడాది పూర్తి కావడంతో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ కోసం ఈ జంట స్పెయిన్ వెళ్లారు.

అక్కడ వీరిద్దరూ స్పెయిన్‌, బార్సిలోనాలోని పర్యటక ప్రాంతాలను సందర్శిస్తూ అందమైన ప్రదేశాలను ఆస్వాధిస్తున్న ఫొటోలను నిహారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక వీరిద్దరూ స్కై డైవింగ్ చేస్తూ ఒకరిపై మరొకరు పంచులు వేసుకుంటూ సరదాగా గడిపిన వీడియో ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇలా స్పెయిన్ వెళ్లినప్పటి నుంచి అక్కడ మీరు గడిపిన ప్రతి ఒక మూమెంట్ అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశారు.అయితే నిహారిక భోజనం చేయకుండా సెల్ఫోన్ చూస్తూ ఉండడం తో నాగచైతన్య సెల్ఫీ దిగి ఆ ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నిహారికకు ఎప్పుడు ఇదే పనే ప్రతిక్షణం ఫోన్లో ఇలా బిజీగా ఉంటుంది అంటూ తనపై ఫిర్యాదు చేశారు.అలాగే మరి కొన్ని క్షణాల తర్వాత నిహారిక సెల్ఫోన్ పెట్టుకొని చూస్తూ నటువంటి మరొక ఫోటోను షేర్ చేస్తూ కొన్ని క్షణాల తర్వాత అంటూ ఇచ్చారు.ఇలా మీరు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు తనకు ముందుగానే పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.